జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని వార్నింగ్ ఇచ్చారు.ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పారు.
వైసీపీ నేతలపై వ్యక్తిగత దూషణలు సరికాదని తెలిపారు.ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడాలని పేర్కొన్నారు.
అందుకే పవన్ జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని హెచ్చరించారు.పవన్ కల్యాణ్ రాజకీయాలు పిల్లలు కూడా ఆశ్చర్య పోయేలా ఉన్నాయని ఎమ్మెల్యే కాటసాని ఎద్దేవా చేశారు.