అల్లు శిరీష్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు.ఈ సమయంలో ఆయన నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.
ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లగా సాగుతున్నాయి.ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒక స్టార్ ను ఆహ్వానించారని తెలుస్తోంది.
మెగా హీరో సినిమా కు పెద్ద హీరో గెస్ట్ అంటే అది మెగా స్టార్ అవుతుంది అనడంలో సందేహం లేదు.కానీ ఈసారి అల్లు శిరీష్ అందరిని ఆశ్చర్య పర్చుతూ బాలకృష్ణ ను తన సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి తీసుకు రాబోతున్నాడు.
అంతే కాకుండా బాలయ్య అన్ స్టాపబుల్ షో లో అల్లు శిరీష్ తన సినిమా ప్రమోషన్ కోసం పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అల్లు వారి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న షో కనుక అన్ స్టాపబుల్ లో అల్లు శిరీష్ రావడం పెద్ద విశేషం ఏమీ కాదు అనేది కొందరి యొక్క మాట.ఆ విషయం పక్కన పెడితే అల్లు శిరీష్ తీసుకున్న నిర్ణయం వెనుక ఉద్దేశ్యం ఏమైనా ఉండి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.గతంలో అల్లు అర్జున్ మరియు బాలయ్య కలిసి కనిపించారు.

కనుక ఇప్పుడు దీంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు అంటూ కొందరు మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య మరియు అల్లు శిరీష్ లను కలిపి చూడాలని కోరుకుంటున్నాం అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.బాలయ్య గెస్ట్ గా వస్తే తప్పకుండా సినిమా యొక్క పాపులారిటీ మరింత పెరిగే అవకాశం ఉంది.కనుక అప్పుడు ప్రేక్షకులు సినిమా కు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.
అల్లు శిరీష్ కి జోడీగా ఈ సినిమా లో అను ఎమాన్యూల్ హీరోయిన్ గా నటించింది.







