తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి నందమూరి నరసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ ఇద్దరు హీరోలు కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడుతూ సినిమాలను చేయడమే కాకుండా ఒకేసారి ఇద్దరి హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో పోటీకి దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఇలా ఎన్నోసార్లు పోటీకి సై అన్నా ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ప్రకటించిన సినిమా టైటిల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి తన 154వ సినిమాకి గాను వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ఇక బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు.
ఈ సినిమా ఇన్ని రోజుల వరకు NBK 107 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంది.ఈ సినిమాకు రెడ్డి గారు అనే టైటిల్ పెడతారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

బాలకృష్ణ తన 107వ సినిమాకు సంబంధించిన టైటిల్ ను చిత్ర బృందం కర్నూలులో ప్రకటించారు.రాయలసీమ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో రాబోతున్న ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు చిరంజీవి వాల్తేరు వీరయ్యలో ” వీర”, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో “వీర”అనే కామెంట్ పాయింట్ గురించి పలు చర్చలు జరుపుతున్నారు.
ఇలా ఇద్దరు హీరోలు టైటిల్ విషయంలో ఒకే పాయింట్ ఉండి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున పోటీకి దిగిపోతున్నారు.మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ హీరో హిట్ కొట్టి వీరుడుగా నిలబడతారు అనే విషయం తెలియాల్సి ఉంది.







