ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మా ఎన్నికల వేడి రగులుతోంది.తెలంగాణలో హుజూరాబాద్, ఆంధ్రాలో బద్వేల్ లో అసెంబ్లీ ఉప ఎన్నికలు ఉన్నా.
మా ఎన్నికల గురించే జనాలు ఫోకస్ పెట్టారు.వానాకాలంలో ఎండాకాలంలా ఎన్నికల హీట్ కలుగుతోంది.
ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.అంతేకాదు.
ఇరు ప్యానెళ్లు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.ప్రకాజ్ రాజ్ ఓ అడుగు ముందుకేసి.
తన ఆవేశాన్నింతా పోగు చేసి మంచు విష్ణు ప్యానెల్ మీద మాటల దాడి చేస్తున్నాడు.అంతే దీటుగా రియాక్షన్ ఇస్తున్నాడు మంచు విష్ణు.
తమపై చేసే వ్యాఖ్యలను తిప్పికొడుతున్నాడు.ఈ నెల 10న మా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెండు ప్యానెళ్లు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకాశ్ రాజ్ గెలుపు అంత ఈజీ కాదనే పరిస్థితి ఏర్పడుతోంది.తాజా పరిణామాల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కు కొంత వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవం అని చెప్పుకోవచ్చు.
తొలుత నాన్ లోకల్ అనే అంశం పెద్దగా సమస్య కాదు అనుకున్నారు.కానీ పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ.ఇదే ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తుంది.తాజాగా నటుడు రవి బాబు ఓ వీడియో పోస్ట్ చేశాడు.
మా అనే సంస్థను మనం నడుపుకోలేమా? దాన్ని ఎవరో వచ్చి పాలించాలా? అనే తీరుగా ఈ బైట్ కొనసాగింది.ఈ వీడియో ప్రభావం వచ్చే ఎన్నికల మీద తప్పకుండా ఉంటుంది అనే మాటలు వినిపిస్తున్నాయి.

అటు ఈ బరిలో మోహన్ బాబు కొడుకు విష్ణు ఉన్నాడు.మోహన్ బాబుకు ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉంది.దీంతో కొందరు సినిమా పెద్దలు ప్రకాష్ రాజ్ ను ముందు పెట్టి వెనకునుంచి చక్రం తిప్పుతున్నారనే వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోతున్నాయి.
అంతేకాదు.తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని ఆయనకు వ్యతిరేకత కలిగించేలా ఉన్నాయి.
సినీ పెద్దల అవసరం లేకుండానే గెలుస్తాను అనే మాటలు మాట్లాడాడు.ఇప్పుడవి ఆయనకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉంది.
మొత్తంగా ఈనెల 10న మా అధ్యక్షుడు ఎవరు అనేది తెలిసే అవకాశం ఉంది.