వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఎవరంటే రోజానే అని ఎవరిని అడిగినా చెప్పేస్తారు.విపక్షంలో ఉన్నా.
ప్రభుత్వంలో ఉన్నా ప్రత్యర్థులతో ఆమె తన మాటల తూటాలతో విరుచుకుపడుతుంటారు.మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఆమెలో ఫైర్ తగ్గలేదు.
రోజా అంటే ఫ్లవర్ కాదని.ఫైర్ అనే సినిమా డైలాగ్‌ను కూడా ఓ సందర్భంలో రోజా గుర్తుచేశారు.
అయితే రోజా చేసిన కామెంట్లు కొన్నిసార్లు మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.
తాజాగా విశాఖ పర్యటనలో అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తొలుత ఆమె అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం అల్లూరి గురించి మాట్లాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు.
అల్లూరి వర్థంతికి బదులు జయంతి అని చెప్పేశారు.పక్కనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఉన్నా ఆమె వర్థంతిని జయంతి అని మాట్లాడటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.
దీంతో రోజా కామెంట్లను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడేసుకున్నారు.ముఖ్యంగా టీడీపీ నేతలు రోజా వీడియోను బాగా వైరల్ చేశారు.
గతంలో ఇదే అంశం గురించి లోకేష్‌ను ఉద్దేశించి అసెంబ్లీలో రోజా చెడుగుడు ఆడుకున్నారు.ఇదేదో పెద్ద ఇష్యూగా మాట్లాడి లోకేష్ ఓ మొద్దబ్బాయి అంటూ కామెంట్ చేశారు.
అప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నోటికొచ్చినట్లు మాట్లాడిన రోజాను ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ట్రోల్ చేస్తున్నారు.

జయంతికి, వర్ధంతికి తేడా తెలియని మంత్రి అంటూ రోజాపై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.అయితే దేశమంతా అల్లూరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని.అదే విషయంపై మంత్రి రోజా మాట్లాడారని.
అందుకే ఆమె జయంతి అని మాట్లాడారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వివరణ ఇస్తున్నా జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది.రాజకీయ నేతలకు వర్ధంతికి, జయంతికి తేడా తెలియకపోవడం మన దౌర్భాగ్యం అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.