జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వారాహి విజయ యాత్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు.నిన్ననే రెండోదశ వారాహి యాత్ర ముగిసింది.
ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు.ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి.
మహిళల అక్రమ రవాణాకు వాలంటీర్లు పాల్పడుతున్నారని.పవన్ చేసినా ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఏదైనా తప్పు జరిగితే వాలంటీర్లు( Volunteers ) భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కూడా హెచ్చరించారు.దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా( Minister Roja ) మండిపడ్డారు.పవన్ తీరు చూస్తే పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చినట్టుందని విమర్శించారు.
ప్యాకేజీ కోసమే ఆయన పని చేస్తున్నట్టున్నారు.పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉంటే…వైసీపీ పార్టీకి సోల్జర్స్ ఉన్నారు.
వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్.జగన్ సైన్యం.
గురించి మాట్లాడతారా అంటూ నిలదీశారు.ఇది షూటింగ్ కాదు రియాల్టీ అంటూ మంత్రి రోజా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.