దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ అమ్మవారిని గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి దర్శించుకున్నారు.ఆలయ ఈవో డి.

 Minister Peddireddy Rama Chandra Reddy Darshans Durgamma Details, Minister Peddi-TeluguStop.com

బ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటము, ప్రసాదము అంద జేశారు.

దర్శనానంతరం మీడియా సెంటర్ లో మంత్రి మాట్లాడుతూ అన్నపూర్ణదేవి అలంకారమంలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషదాయకం అని అన్నారు.రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని అమ్మవారిని ప్రార్ధించానన్నారు.

భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు.మంత్రితో పాటు మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube