ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.రోజ్ గార్ మేళా పేరుతో యువతను మరోసారి మోసం చేయడమేనన్నారు.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ముందు మోదీ మరో కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు.నమో అంటే నమ్మించి మోసం చేసేవారు అని రుజువైందని తెలిపారు.
ప్రతి ఎన్నికల ముందు యువతను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యకర్రమాలను పక్కన పెట్టాలని లేఖలో పేర్కొన్నారు.ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
కానీ 16 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు.మీ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని నిలదీశారు.
రోజ్ గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాలు అందించడాన్ని నిరుద్యోగులు గమనిస్తున్నారని తెలిపారు.బీజేపీ ప్రభుత్వంపై యువత తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటికైనా నిబద్ధతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలని స్పష్టం చేశారు.అనంతరం దేశంలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
.