మంచు విష్ణు రూ.100 కోట్ల కామెంట్స్ పై దారుణమైన ట్రోల్స్‌

మంచు విష్ణు తాజాగా జిన్నా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేసిన మంచు విష్ణు దారుణమైన కలెక్షన్స్ ని చవి చూస్తున్నాడు.

 Manchu Vishnu Getting Trolls In Social Media , Film News, Ginna Movie, Manchu Vi-TeluguStop.com

కనీసం పాతిక లక్షల రూపాయల షేర్ కలెక్షన్స్ నమోదు అయితాయా అంటే అనుమానమే అన్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఈ సమయం లో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.

తన మార్కెట్ గురించి మాట్లాడుతూ.ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసే స్థాయి ఉన్న సబ్జెక్ట్ అంటూ సినిమా పై అంచనాలు పెంచే విధంగా మాట్లాడాడు.మంచు విష్ణు ఆ స్థాయి లో మాట్లాడడం తో తప్పకుండా సినిమా లో మ్యాటర్ ఉంటుందేమో అంటూ చాలా మంది చాలా రకాలుగా ఊహించుకున్నారు.

తీరా సినిమా చూస్తే అంత సీన్ లేదు అన్నట్లుగా ఉంది అంటూ ప్రేక్షకులు అంటున్నారు.

ఇలాంటి సినిమా చేశావేంటి అంటూ మంచు విష్ణు ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

కథ ఎంపిక విషయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మినిమం తీసుకుంటున్నారా మీరు అంటూ కొందరు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా లో మంచి విష్ణు పై ట్రోల్స్ శృతి మించి వస్తున్నాయి.

ఆయన ని వ్యక్తిగతంగా కొందరు టార్గెట్ చేసి మరి విమర్శలు చేయిస్తున్నారట.తాజాగా జిన్నా సినిమా విడుదలైన తర్వాత వస్తున్న విమర్శలను చూస్తుంటే అది నిజమేమో అనిపిస్తుంది అంటూ మంచు ఫ్యామిలీ అభిమానులు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అసలు విషయం ఏమో కానీ జిన్నా సినిమా పై నమ్మకం పెట్టుకున్న వారికి మాత్రం తీవ్రంగా నిరాశ మిగిలింది.జిన్నా సినిమా వసూళ్ల విషయంలో జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube