పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబిబిఎస్ చదువుకి మంత్రి కేటీఆర్ సహకారం

కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష పరిస్థితి  తెలుసుకున్న కేటీఆర్.కిర్గిజీస్టాన్ ఎం బి బి ఎస్ కోర్సు తొలి 3 ఏళ్లలో 95% కు పైగా మార్కులు సాధించిన అనూష.అనూష వైద్యవిద్యకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్.

 Minister Ktr Contribution To Poor Tribal Medical Student Mbbs Education, Ministe-TeluguStop.com

హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన తిరుపతి అనూష కిర్గిజీస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబిబిఎస్ చదువుతుంది.

అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది.ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.

అయితే కరోనా నేపద్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లి తో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది.పేద గిరిజన కుటుంబానికి చెందిన అనూష తండ్రి వాచ్మెన్ గా పని చేస్తున్నారు.

తన వైద్య విద్య కోర్సు  ఫీజుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది.తన పేదరిక పరిస్థితుల నేపథ్యంలోనూ ఎంతో ఛాలెంజింగ్గా, వైద్య విద్య పై మక్కువతో విదేశాలకు వెళ్లి చదువుకునే ప్రయత్నం చేస్తున్న అనూష కి కేటీఆర్ అండగా నిలిచేందుకు నిర్ణయం తీసుకొన్నారు.

ఈరోజు ఆమె వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేశారు.అనూష ఎంబీబీఎస్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్, కోర్సు పూర్తి చేసుకొని డాక్టర్ గా తిరిగి రావాలన్నారు.

ఈ సందర్భంగా అనూష కి ఆల్ ద బెస్ట్ చెప్పిన మంత్రి, ఆమె కు అన్నివిధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అనూష వైద్య విద్యకు అండగా నిలిచిన మంత్రి కేటీఆర్ కి ఆమె కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube