యాదగిరిగుట్ట గానే యాదాద్రి...పేరు మార్పు పరిశీలనలో ఉంది: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరిగుట్ట గా మార్పు చేస్తామని చెప్పారు.

 Minister Komati Reddy Venkata Reddy Is Considering Changing The Name Of Yadadri-TeluguStop.com

దీనికి సంబంధించి త్వరలోనే జీవో ఇస్తామని తెలిపారు.ఇప్పటికే ఇదే విషయమై స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ప్రకటన చేయగా,తాజాగా మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో యాదాద్రి పేరుమార్పుపై స్పందించారు.

భువనగిరి నుంచి పోటీ చేయమని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చెప్పానన్నారు.భువనగిరి, నల్లగొండ,ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో దక్షిణ భారతదేశంలోనే భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ కంటే రాహుల్ అత్యధిక ఓట్లతో గెలుస్తారని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube