పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేసింది అట్టర్ ఫ్లాప్ షో అని విమర్శించారు.
సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు జనం వచ్చారా అని ప్రశ్నించిన మంత్రి అంబటి రాకపోయినా మహా అద్భుతం అనడం టీడీపీ ఖర్మ అని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఎన్నడైనా ఒక్క నిజం చెప్పారా అని ప్రశ్నించారు.
జగన్ రాజకీయాలకు ఎలా అనర్హుడు అయ్యారో చెప్పాలన్నారు.రెక్కల కష్టంతో పార్టీని నిలబెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ అనర్హులా అని నిలదీశారు.