ఎలాన్ మస్క్ బృందంలో కీ రోల్.. ఎవరీ రోహన్ పటేల్, ఎందుకు టెస్లాను వీడారు..?

అమెరికన్ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) భారత పర్యటన వాయిదా పడింది.విద్యుత్ కార్ల తయారీ సంస్థకు చెందిన కీలక బాధ్యతల కారణంగా తన పర్యటన ఆలస్యం అవుతోందని ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు.

 Meet Rohan Patel Man At Core Of Teslas India Plans Who Exited Firm Days Before E-TeluguStop.com

ఈ ఏడాది చివరిలో భారత్‌లో పర్యటించేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం టెస్లా చీఫ్ ఈ నెల 21, 22 తేదీలలో భారతదేశంలో పర్యటించాల్సి వుంది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో( PM Narendra Modi ) ఆయన భేటీ కావాల్సి వుంది.

ఎలాన్ మస్క్ హై ప్రొఫైల్ పర్యటన నేపథ్యంలో భారత్-టెస్లా రెండింటికీ విజయం ఖాయమని అంచనా వేయబడింది.

మోడీ మేడ్ ఇన్ ఇండియా ప్రణాళికలకు అనుగుణంగా భారతదేశంలో ఫ్యాక్టరీని నిర్మించేందుకు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఎలాన్ మస్క్ ప్రకటించాలని భావించారు.అలాగే భారతదేశంలో తన ప్రతిష్టాత్మక స్టార్ లింక్ ప్రాజెక్ట్‌ను విస్తరించాలనే యోచన కూడా ఆయనకు వుంది.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో తన స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు భారత ప్రభుత్వ ఆమోదం కోసం ఎలాన్ మస్క్ ఎదురుచూస్తున్నారు.

Telugu Drew Baglino, Electric Cars, Elon Musk, Elonmusk, Ev Cars, Rohan Patel, T

ఇదిలావుండగా.టెస్లా( Tesla ) పబ్లిక్ పాలసీ, బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రోహన్ పటేల్( Rohan Patel ) ఏప్రిల్ 15న కంపెనీ నుంచి నిష్క్రమించడం ఆసక్తికరంగా మారింది.భారతదేశంలో టెస్లా విస్తరణ ప్రణాళికా బృందంలో ఆయన ప్రధాన సభ్యుడు.

ఇదే సమయంలో పవర్ ట్రెయిన్, ఎనర్జీ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ డ్రూ బాగ్లినో( Drew Baglino ) కూడా ఏప్రిల్ 15న కంపెనీని విడిచిపెట్టారు.వీరిద్దరూ వేర్వేరుగా తమ నిష్క్రమణను ఎక్స్ ద్వారా ప్రకటిస్తూ.

ఎలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Telugu Drew Baglino, Electric Cars, Elon Musk, Elonmusk, Ev Cars, Rohan Patel, T

క్లైమేట్ అండ్ ఎనర్జీ సమస్యలపై ఇతర విధానపరమైన విషయాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సీనియర్ సలహాదారుగా పనిచేసిన తర్వాత రోహన్ పటేల్ 2016లో టెస్లాలో చేరారు.టెస్లా ప్లాన్‌పై చర్చించేందుకు ఇన్వెస్ట్ ఇండియా ఏజెన్సీ అధికారులను కలవడానికి రోహన్ పటేల్ న్యూఢిల్లీలో వున్నారని 2023లో రాయిటర్స్ నివేదిక పేర్కొంది.టెస్లా ప్రతినిధులు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌ను కలవాలని భావిస్తున్నారని.

ఈవి సప్లై చైన్‌ను ఏర్పాటు చేయడం , కర్మాగారానికి భూ కేటాయింపులపై చర్చలు జరుగుతాయని కూడా ఏజెన్సీ నివేదించింది.

Telugu Drew Baglino, Electric Cars, Elon Musk, Elonmusk, Ev Cars, Rohan Patel, T

మరోవైపు సరసమైన కొత్త ఈవీని తయారు చేసే ప్రణాళికలను టెస్లా పక్కనపెట్టిందని రాయిటర్స్ ఇటీవల నివేదించింది.చైనీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల నుంచి ప్రపంచవ్యాప్తంగా టెస్లా తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నందున 10 వేల డాలర్ల కంటే తక్కువ ధరకే ఈవీ కార్లు( EV Cars ) మార్కెట్‌ను ముంచెత్తుతున్నందున ఎలాన్ మస్క్ ఆలోచనలో పడినట్లుగా ప్రచారం జరుగుతోంది.నివేదికల ప్రకారం టెస్లా ప్రపంచవ్యాప్తంగా తన సిబ్బందిలో 10 శాతం దాదాపుగా 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube