అమెరికాలో భారతీయ విద్యార్ధి మృతి .. ‘‘ బ్లూ వేల్ ఛాలెంజే ’’ కారణమా ..?

అమెరికాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 11 మంది భారతీయ, భారత సంతతి వ్యక్తులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ పరిణామాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

 Indian Student's Death In Us Possibly Linked To 'blue Whale Challenge', Blue Wha-TeluguStop.com

తాజాగా అమెరికాలో భారతీయ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.‘‘ బ్లూ వేల్ ఛాలెంజ్ ’’ ( Blue Whale Challenge )అని పిలిచే ఈ ఆన్‌లైన్ గేమ్‌ను సూసైడ్ గేమ్( Suicide Game ) అని కూడా పిలుస్తారు.20 ఏళ్ల బాధిత విద్యార్ధి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అతని పేరు, వివరాలను వెల్లడించలేదు.మసాచుసెట్స్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అతను మార్చి 8న శవమై కనిపించాడు.

బ్రిస్టల్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ప్రతినిధి గ్రెగ్ మిలియోట్ ( Greg Miliot )ఈ కేసును స్పష్టమైన ఆత్మహత్యగా పరిశోధిస్తున్నట్లు తెలిపారు.అంతకుముందు ఈ మరణాన్ని హత్యగా విస్తృతంగా ప్రచారం జరిగింది.

విద్యార్ధిని బోస్టన్ యూనివర్సిటీకి చెందిన వ్యక్తిగా తప్పుగా గుర్తించబడటంతో పాటు దోపిడి జరిగినట్లుగా కథనాలు వచ్చాయి.విద్యార్ధి మృతదేహన్ని అడవిలో ఓ కారులో కనుగొన్నారు.

బోస్టన్ గ్లోబ్ వార్తాపత్రిక ఆ విద్యార్ధిని పేరు ద్వారా గుర్తించింది.అయితే సదరు ఏజెన్సీ.

అతని కుటుంబ విజ్ఞప్తి మేరకు పేరును బహిర్గతం చేయలేదు.కేసును ఆత్మహత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Blue Whale, Boston, Bristol County, Greg Miliot, Indianpossibly, Indian,

ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువత ఈ ప్రమాదకరమైన గేమ్ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.‘‘ బ్లూ వేల్ ఛాలెంజ్ ’’ అనేది ఆన్‌లైన్ గేమ్.దీనిలో పాల్గొనేవారికి డేర్ ఇస్తారు.50 దశలలో సాగే ఈ డేర్ రానురాను కష్టంగా వుంటుంది.అనధికారిక మూలాల ప్రకారం.బాధిత విద్యార్ధి రెండు నిమిషాల పాటు తన శ్వాసను నిలిపివుంచడంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా కథనాలు వస్తున్నాయి.ఈ గేమ్ ప్రతికూల ప్రభావాలను గమనించిన భారత ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే దీనిని నిషేధించాలని భావించింది.అయితే వివరణాత్మక సలహా కోసం ఆదేశాలను నిలిపివుంచింది.

బ్లూ వేల్ గేమ్ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2017లో విడుదల చేసిన ఓ అడ్వైజరీలో పేర్కొంది.

Telugu Blue Whale, Boston, Bristol County, Greg Miliot, Indianpossibly, Indian,

దీనిని సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలోని సీక్రెట్ గ్రూపుల ద్వారా షేర్ చేయబడుతోందని.ఈ గేమ్ సృష్టికర్తలు డిప్రెషన్‌లో వున్న వారిని వెతుకుతూ తమ గ్రూప్‌లో చేరాల్సిందిగా ఆహ్వనం పంపుతారు.ఈ గేమ్‌లో క్యూరేటర్ అని పిలవబడే అనామక గ్రూప్ అడ్మినిస్ట్రేటర్( Anonymous group administrator ) ఎంపిక చేసిన ప్లేయర్‌లకు 50 టాస్క్‌లను అందజేస్తారు.

వాటిని 50 రోజుల వ్యవధిలో పూర్తి చేసి డాక్యుమెంట్ చేసి పోస్ట్ చేయాలి.ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన తర్వాత ఈ గేమ్‌ను ఆడకుండా వుండలేరు.ఒకవేళ గేమ్‌ను ఆడకూడదని భావిస్తే.బ్లాక్ మెయిల్ చేయబడటంతో పాటు సైబర్ బెదిరింపులకు గురవుతారు.2015-2017లో రష్యాలలో అనేక బ్లూ వేల్ ఛాలెంజ్ మరణాలు నమోదయ్యాయి.నివేదికల ప్రకారం ఈ గేమ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో ఆడుతారు.

ప్రారంభంలో ఈ గేమ్ ఎలాంటి హానికరం కాదు.కానీ చివరి దశలో మాత్రం ప్రాణాలకు ముప్పు కలిగించేలా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube