చెన్నై తాంబరంలో సినీ ఫక్కీ తరహాలో భారీ చోరీ జరిగింది.బ్లూ స్టోన్స్ జువెల్లర్స్ లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ఈ ఘటనలో సుమారు రూ.కోటిన్నర విలువైన వజ్రాలు, బంగారు అభరణాలను దుండగులు దోచుకెళ్లారు.అయితే చోరీకి పాల్పడిన సమయంలో అలారం మోగినా సెక్యూరిటీ పట్టించుకోలేదని తెలుస్తోంది.అదే విధంగా స్టోర్ మేనేజర్ కు కూడా అలారం వెళ్లడంతో అప్రమత్తమైన ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
దొంగతనం చేసిన తర్వాత అక్కడే రూమ్ లోనే నిందితులు దాక్కున్నారని సమాచారం.ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులు అసోంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.వీరిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని తెలిపారు.