వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నో విలక్షణమైన సినిమాలను తెరకెక్కించి టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా మంచి పేరు ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆయన దర్శకత్వం లో వచ్చిన కొన్ని సినిమా లు ఇప్పటికీ కూడా ఎంతో మంది యంగ్ దర్శకులకు ఒక పాఠం అన్నట్లుగా నిలుస్తున్నాయి.
అలాంటి సినిమా లను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య చిన్నా చితకా సినిమా లు తెరకెక్కించడం మొదలు పెట్టాడు.ఇప్పటికి కూడా అదే పంథా కొనసాగిస్తున్నాడు.
రాం గోపాల్ వర్మ ఏడాది లో పదుల కొద్ది సినిమా లను ప్రకటిస్తాడు.అందులో చాలా తక్కువ సినిమా లను మాత్రమే పూర్తి చేస్తాడు అనే విమర్శలు ఉన్నాయి.
ఏదైనా బర్నింగ్ టాపిక్ కనిపిస్తే చాలు వెంటనే ఆ టాపిక్ పై సినిమా ను తీసేస్తాను అంటూ ప్రకటించడం.పోస్టర్ విడుదల చేయడం చేసేవాడు.
అలా రాం గోపాల్ వర్మ ఎన్నో సినిమాలను ప్రకటించి వదిలేసాడు.
ఈ మధ్య కాలం లో ఆయన అలా చేయడం కాస్త తగ్గిందని చెప్పాలి.
ఆయన తగ్గించాడనే ఉద్దేశంతోనో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గతం లో వర్మ ఎలా అయితే సినిమా లకు కమిట్ అయ్యాడో, ఎలా అయితే సినిమాలను ప్రకటించేవాడో ఇప్పుడు అలాగే పవన్ వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.పవన్ కళ్యాణ్ ఒక వైపు జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ కమిట్ అవుతున్నాడు.
ఎప్పుడో ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు.అయినా కూడా హరీష్ శంకర్ నుండి మొదలు పెట్టి ఇటీవల జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ వరకు పవన్ కళ్యాణ్ సినిమా లు చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఒకానొక సమయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సినిమా లు చేసినా చాలు కానీ ఇలా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలకు కమిట్ అవ్వవద్దు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.