Manchu Manoj : మౌనిక రెడ్డితో ఏకాంతంగా వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న మనోజ్.. ఫోటో వైరల్!

ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం కావడంతో పలువురు సెలబ్రిటీలు ఎంతో ఘనంగా వాలెంటైన్స్ డే ( Valentine’s day ) శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.అదే విధంగా వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

 Manchu Manoj And Mounika Valentine Day Celebration Photo Goes Viral-TeluguStop.com

ఈ క్రమంలోనే నటుడు మంచు మనోజ్ ( Manchu Manoj ) తన భార్య భూమా మౌనిక రెడ్డి(Mounika Reddy) తో కలిసి విదేశాలలో వాలెంటైన్స్ డే వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది.

మంచు మనోజ్ భూమా మౌనిక( Mounika Reddy ) ఇద్దరికీ ఇది రెండో వివాహం కావటం విశేషం గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట గత ఏడాది పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.పెళ్లి తర్వాత మొదటి వాలెంటైన్స్ డే కావడంతో ఈ స్పెషల్ డేని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు.విదేశాలకు వెళ్లి బీచ్ ఒడ్డున క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వీరిద్దరూ ఎంతో ప్రశాంతంగా ఈ వేడుకను జరుపుకున్నారని తెలుస్తోంది.

తమ వాలెంటైజ్ డేకి సంబంధించిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇలా సముద్రపు ఒడ్డున ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు చేయిని వేసి ఒకరి కళ్ళల్లో మరొకరు చూసుకుంటూ ఉన్నటువంటి ఈ ఫోటోని మనోజ్ షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక భూమా మౌనికతో వివాహం అనంతరం మంచు మనోజ్ కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు.ఇక మంచు మనోజ్ ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా తన భార్య మౌనికను వెంటబెట్టుకొని వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం మౌనిక ప్రెగ్నెంట్ అని త్వరలోనే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయాన్ని కూడా మనోజ్ వెల్లడించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube