ఒక స్టార్ హీరో( Star Hero ) అంటే ఎలా ఉంటాడు కమర్షియల్ హంగులు, మాస్ మసాలా ఫైట్స్, యాక్షన్, ఫ్యాన్స్, ప్రతిరోజు తన చుట్టూ తిరిగే మంది మార్బలం ఇలా హడావిడిగా ఉంటుంది ఆ హీరో జుట్టు ఉన్న పరిస్థితులు కానీ సైలెంట్ గా తన పని మాత్రమే తాను చేసుకుంటూ లాభం లేదా ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాలను చేస్తూ 70 ఏళ్ల వయసులో హీరోయిజం అనే అవ లక్షణాన్ని రుద్దుకోకుండా కేవలం నటుడిగా మాత్రమే నిలబడాలి అని అనుకుంటే అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మమ్ముట్టి.( Mammootty ) ఉదాహరణకు మన తెలుగులో స్టార్ హీరో ఇద్దరు ముగ్గురుని తీసుకోండి.

వయసు మీద పడుతున్న సమయంలో కూడా పాతికేళ్ల కన్నా తక్కువ వయసున్న హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారు.వంద మంది చుట్టూ ఉండి ఒక్కడే కొట్టే ఫైట్స్ చేయడానికి తహాతహాలాడతారు.స్టార్ హీరోని కాబట్టి ఈ హీరోయిన్ ఉండాలి లేదంటే ఫ్యాన్స్ ఒప్పుకోరు అనే భ్రమలో ఉంటారు.లేదంటే కుర్చీ మడత పెట్టి గళ్ళ లుంగీ కట్టి మనం తోపులం అనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటారు.
మమ్ముట్టి ఈ అన్ని హడావిడిలకు చాలా దూరం.ఆయన తీసే సినిమాలు కానీ నటించే పాత్రలు కానీ స్టార్ హీరోల ప్రవర్తనకు పూర్తి విరుద్ధం.

అయితే ఇలాంటి వ్యాఖ్యలు మనం గతంలో చాలాసార్లు చేసాం కానీ ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి మరొక కారణం దొరికింది.అదే కాదల్ ది కోర్.( Kaathal The Core ) అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది.జ్యోతిక,( Jyothika ) మమ్ముట్టి మెయిన్ లీడ్స్ గా నటించిన ఈ చిత్రం చూసిన తర్వాత ఒక గుండె బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది.
మమ్ముట్టి ఈ సినిమాలో హోమో సెక్సువల్ గా నటించడం అని చెప్పొచ్చు కచ్చితంగా ఈ సినిమా చూసిన తర్వాత అతడికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.వందల కోట్ల కలెక్షన్స్ అనే ఒక సునామీని నెత్తికెక్కించుకుని, సామాజిక స్పృహ మర్చిపోయి, సోకాల్డ్ హీరోయిజం( Heroism ) అనే మత్తులో ఉన్న అనేక మందిని నటులకు, హీరోలకు చెంపపెట్టు లాంటిది ఈ సినిమా.

ఇక ఈ చిత్రంలో జ్యోతిక నటన కూడా అద్భుతంగా ఉంది ఒక బ్రాడ్ మైండ్ ఉండి సమాజంలో అందరికీ విలువ ఇచ్చే అన్ని రకాల మనుషులకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో ఆమె చక్కగా ఒదిగి నటించింది.ఇదే మీ సినిమాకు సంబంధించిన రివ్యూ కాదు తెలుగులో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక సాహసం మలయాళం లో మమ్ముట్టి ఎలా చేయగలిగాడు అనేదే ఒక కంపారిజన్.ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్న ఇలాంటి ఒక పాత్ర తెలుగులో ఏ నటుడు కూడా చేయడు.ఎంత పెద్ద హీరో కూడా ఒప్పుకోడు.చిన్న నటులు కూడా చేయడానికి భయపడతారు.కానీ అది మమ్ముట్టికి మాత్రం అవలీలగా చేయగలిగే పని.