ఏపీలోని టీడీపీ నేత దేవినేని ఉమకు లీగల్ నోటీస్ అందిందని తెలుస్తోంది.ఈ మేరకు దేవినేని ఉమకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీస్ ఇచ్చారు.
గతంలో తనపై హత్య, ఆర్థిక నేరాల ఆరోపణలు చేశారని పేర్కొంటూ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీస్ ఇచ్చారని సమాచారం.తన పరువుకు భంగం కలిగించారని ఆయన నోటీసుల్లో తెలిపారు.
ఈ క్రమంలోనే దేవినేని ఉమ చేసిన 14 ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం కాలేదని వెల్లడించారు.మాజీ మంత్రి దేవినేని ఉమ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు.







