తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ( BRS )కు మరో షాక్ తగలనుంది.ఆ పార్టీకి మాజీ మంత్రి మల్లారెడ్డి,( Mallareddy ) ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy ) గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో మామ, అల్లుడు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
వీరు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ( Congress party )లో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే మామ అల్లుడు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది.అయితే నిన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని అధికారులు ఆ భవనాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.
కాగా మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వీటిపై ఫిర్యాదు చేశారు.రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అధికారులు భవనాలను కూల్చివేశారు.