క్యాప్సికంభారతీయులు అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఇదీ ఒకటి.మిరప జాతికి చెందినదే అయినప్పటికీ.
మిరపకాయ అంత కారంగా క్యాప్సికం ఉండదు.అందుకే క్యాప్సికంతో రకరకాలుగా కూరలు వండుతుంటారు.
అయితే క్యాప్సికంను వండుకుని కంటే పచ్చిగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.వాస్తవానికి క్యాప్సికంలో విటమిన్ ఎ, విటమిస్ సి, విటమిన్ బి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, కేరోటినాయిడ్స్ ఇలా అనేక పోషకాలు నిండి ఉంటాయి.
అలాగే క్యాప్సికంలో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి.అయితే ఉడికించడం లేదా వేయించడం వల్ల క్యాప్సికంలో ఉండే సగం పోషకాలు కరిగిపోతాయి.
అందుకే పచ్చి క్యాప్సికంను తీసుకుంటే మంచిదని అంటున్నారు.సలాడ్స్ రూపంలోనూ లేదా ఇతరితర విధాలుగా పచ్చి క్యాప్సికమ్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
పైగా పచ్చి క్యాప్సికమ్‌ను తీసుకోవడం వల్ల బోలెడన్ని బెనిఫిట్స్ కూడా పొందొచ్చట.మరి ఆ బనిఫిట్స్ ఏంటో చూసేయండి.పచ్చి క్యాప్సికమ్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ గ్రహించే శక్తి పెరుగుతుంది.దాంతో రక్త హీనత దరి చేరకుండా ఉంటుంది.అలాగే పచ్చి క్యాప్సికమ్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరానికి విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.ఫలితంగా కంటి చూపు పెరుగుతుంది.
అంతేకాదు, పచ్చి క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ ర్యాడికల్స్ నాశనం అవుతాయి.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి.గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఆస్తమా మరియు ఇతర శ్వాస సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
ఇక షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.