ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రపంచంలో ఏ మూలన ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో ప్రతి విషయం అందరికీ తెలిసిపోతుంది.ఈ మధ్యకాలంలో కష్టాలు కేవలం మనుషులకు మాత్రమే కాదు జంతువులకు ( Animals ) కూడా వస్తున్నాయి.
చిన్న చిన్న జంతువులకు పెద్ద జీవులు అంటే భయం.అలాగే పెద్ద జీవులకు ఆహారం దొరకకపోతే అదో భయం.ఇలా పెద్ద జంతువులైన సింహం, పులి లాంటి వన్యమృగాలు వాటి ఆహారం కోసం వెతికే సమయంలో కొన్నిసార్లు కష్టాలని కొని తెచ్చుకుంటాయి.ఇలాగే తాజాగా ఓ చిరుతకు( Leopard ) చెప్పుకోలేని కష్టం ఎదురయింది.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉన్న ప్రాణులు వాటి ఆహారం కోసం లేదా నీటి కోసమో ప్రజలు ఉండే చోటికి రావడం ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి.ఇలా ఓ చిరుత తన ఆహారం కోసం ఓ పశువుల కొట్టంలోకి వెళ్ళింది.అక్కడికి వెళ్ళిన తర్వాత తినడానికి ఏదైనా ఆహారం ఆవు రూపంలో దొరుకుతుందేమో అని ప్రయత్నించింది.కాకపోతే అక్కడ ఆవులు( Cows ) లేకపోవడంతో చిరుత చేసేదేమీ లేక చివరికి దాహమైన తీర్చుకుందాం అని చెప్పి ఆ షెడ్ లో ఉన్న లోహపు పాత్రలో నీళ్లు తాగడానికి తన తలను పెట్టింది.

దాంతో ఆ చిరుత కష్టాలు చెప్పడానికి వీలు కాదు.దీనికి కారణం ఆ చిరుత మెడ ఆ లోహపు పాత్రలో ఇరుకొనిపోవడమే.దాంతో లోహ పాత్ర నుంచి తలను బయటకు తీయడానికి ఆ చిరుత లోహ పాత్రతో అటు ఇటు పరిగెత్తి గోడకు గుద్దుకున్న కాని వీలు కాలేదు.ఆ తర్వాత అక్కడ ప్రజలు దానిని గమనించి అటవి అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ చిరుత పులికి మత్తుమందు ఇచ్చి తలకు ఉన్న లోహపు పాత్రని కట్టర్ ద్వారా తీసేశారు.
ఆపై దానిని అడవిలో వదిలేశారు.







