ఆడవాళ్ళను మగవాళ్లు వేధిస్తున్నారని అనేక సందర్భాల్లో మనం వార్తలను చూసే ఉంటాము.ఇలాంటి వాటి వల్ల మగవారిని అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.కాకపోతే ప్రస్తుతం ఓ రోబో సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.‘ఆండ్రాయిడ్ మహమ్మద్’ ( Android Mohammed )అనే మొదటి మేల్ రోబో ఘనకార్యం చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతుంది. రియాద్ నగరంలో ( Riyadh )జరిగిన డీప్ ఫాస్ట్ అనే రోబో ఈవెంట్లో మొదటిసారి ఈ రోబోను ప్రదర్శనకు ఉంచారు.అయితే ఈ కార్యక్రమంలో ఆ మగ రోబో చేసిన ప్రవర్తన చాలామంది సోషల్ మీడియా యూజర్లకు ఆగ్రహం వచ్చే విధంగా ఉంది.
ఈ వీడియో లో ఓ లేడీ జర్నలిస్ట్ ఆ రోబో ముందు నిల్చుని సదరు రోబో కంపెనీ యజమానితో మాట్లాడుతుండగా.ఆ రోబో సడన్ గా లేడీ జర్నలిస్ట్ వెనుక భాగాన్ని టచ్ చేయడానికి ప్రయత్నించింది.

ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్స్ వీడియోలో రికార్డ్ అయ్యాయి.ఆ రోబో ఏఈ టెక్నాలజీతో రూపొందించబడింది.టీవీ జర్నలిస్ట్ రవి మాసిమి వెనుక భాగాన్ని ఏఐ రోబోట్ టచ్ చేసేలా కనపడింది.దాంతో ఆ మహిళ జర్నలిస్ట్ ఒక్కసారిగా అసౌకర్యంగా ఫీల్ అయింది.రోబో చెయ్యి తగలకుండా ఆమె అక్కడ నుంచి కాస్త పక్కకు జరిగింది.వీటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.
ఇదివరకు మనుషులు మాత్రమే మహిళలను వేధిస్తున్నారని., ఇక ముందు ముందు రోబలతో కూడా ఇలాంటి చర్యలు చేస్తాయేమో అంటూ వారి భావాలను వ్యక్తపరుస్తున్నారు.
మరికొందరైతే ఈ రోబోను తయారుచేసిన వ్యక్తులను నిందిస్తున్నారు.







