ఇదివరకు కాలంలో అమ్మాయిలకు పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు అనేక కష్టాలు పడి ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసేవారు.కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది.
అబ్బాయిలకు అమ్మాయిలు దొరకాలంటే చాలా కష్టంగా మారింది.అబ్బాయికి ఎంత ప్రాపర్టీ ఉంది, ప్రస్తుతం ఎంత ప్యాకేజ్ తీసుకుంటున్నాడు ఇలా అనేక రకాల విషయాలను అన్ని చూసుకొని తర్వాతనే పెళ్లిళ్లు చేస్తున్నారు.
అంతేకాదు ఇదివరకు ఏదైనా కండిషన్లు అబ్బాయిలు చెప్పేవారు.ప్రస్తుతం అమ్మాయిలు చెప్పే పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితిని కొంతమంది అమ్మాయిలు కాస్త వారికి అనుగుణంగా చేసుకొని అతిగా కూడా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి.అచ్చం అలాంటి సంఘటన తాజాగా ఒకటి దుబాయ్( Dubai ) లో జరగడంతో అది కాస్త వైరల్ గా మారింది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.దుబాయ్ లో ఉన్న ఓ మిలినియర్ భార్య తన భర్తను పెళ్లి చేసుకునే ముందే ఓ దిమ్మతిరిగే కండిషన్ తెలిపింది.ఈ కండిషన్ ఒప్పుకున్నాకనే వారు ఇరువురు పెళ్లి చేసుకున్నారు.ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే.పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లలను కనాలంటే నెల రోజులకు ఏకంగా రెండున్నర కోట్ల ( Two and a half crores ) నెలవారి బత్యం ఇవ్వాలని ఆమె కోరింది.అలా ప్రతినెల తన పేరు మీద బ్యాంకులో డబ్బులు జమ చేయాలని తేల్చి చెప్పింది.

తానేమి ఫ్రీగా ప్రెగ్నెన్సీ పెయిన్ ను భరించడానికి సిద్ధంగా లేనని తెలిపింది.అంతేకాదు తన భర్త జమాల్( Jamal ) ఆస్తిని ఖర్చు చేయడం తనకు చాలా ఇష్టమని కూడా తెలిపింది.వీటితోపాటు పిల్లలు పుట్టాక వారికోసం ఓ లగ్జరీ గదిని ఏర్పాటు చేయాలని అలాగే వారు పుట్టిన సమయంలో తనకి శరీరం అలసిపోతుందని,అందుకోసం మసాజ్, తెరపిస్ట్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కూడా తెలియజేసింది.అంతే కాదండి పిల్లల వల్ల రాత్రిపూట నిద్ర డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు నర్సులను కూడా నియమించాలని ముందుగానే తెలిపింది.
ఇంకా డబుల్ ట్విస్ట్ ఏంటంటే.ఒకవేళ ట్విన్స్ పుడితే అమౌంట్ డబల్ అవుతుందని కూడా తెలిపింది.
ఇన్ని కోరికలను చూసిన నెటిజెన్స్ ఆశ్చర్యంతో ఏం మాట్లాడాలో కూడా తెలియలేని స్థితిలో ఉండిపోయారు.







