Mallareddy Marri Rajasekhar Reddy : బీఆర్ఎస్‎కు గుడ్ బై చెప్పనున్న మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి..!?

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ( BRS )కు మరో షాక్ తగలనుంది.

ఆ పార్టీకి మాజీ మంత్రి మల్లారెడ్డి,( Mallareddy ) ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy ) గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో మామ, అల్లుడు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

"""/" / వీరు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో చేరాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే మామ అల్లుడు కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది.

అయితే నిన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన విద్యాసంస్థలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని అధికారులు ఆ భవనాలను కూల్చివేసిన సంగతి తెలిసిందే.

కాగా మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి( Revanth Reddy ) వీటిపై ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు అధికారులు భవనాలను కూల్చివేశారు.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?