హీరోయిన్ మంజు వారియర్( Manju Warrior ) గురించి మనందరికీ తెలిసిందే.నాలుగుపదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది.
అంతేకాకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇటీవల తమిళ్ స్టార్ హీరో అజిత్( Ajith ) నటించిన తునివు సినిమాలో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది.
కేవలం మంజు వారియర్ హీరోయిన్ మాత్రమే కాకుండా ఇతర వాటిలో కూడా ఆమె చాలా చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది.మరి ముఖ్యంగా ఆమెకు తెలిసిన టాలెంట్లలో బైక్ రైడింగ్ కూడా ఒకటి.ఇటీవల అజిత్ సినిమా చేయడంతో అతనితో కలిసి ఆ ఇంట్రెస్ట్ ను ఇంకా పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.తనకు సమయం దొరికినప్పుడల్లా హీరో అజిత్ తో బైక్ పై లాంగ్ రైడింగ్ చేస్తానని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.
కాగా తునివు సినిమాలో అజిత్, మంజు వారియర్ ఇద్దరు కలిసి వైజాగ్ నుంచి లడక్ వరకు బైక్ రైడింగ్ చేశారు.కేవలం వీరు మాత్రమే కాకుండా వీరితోపాటు మరికొంతమంది ఈ బైక్ రైడింగ్ లో పాల్గొన్నారు.
ఈ ఫోటోలు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.
వల్లే తనకు లాంగ్ బైక్ రైడింగ్స్ అలవాటు అయ్యాయి అని ఆమె గతంలో ఒకసారి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మరోసారి మంజు వారియర్ బైక్ రైడింగ్ కు వెళ్లింది.మలయాళ నటులు సౌబిన్ షాహీర్, బినేష్ చంద్ర కూడా మంజుతో కలిసి బైక్ రైడింగ్ కు వెళ్లారు.
ఇక మార్గం మధ్యలో కలసి వారితో దిగిన ఫోటోలు మంజు వారియర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.నేను ఎదుర్కొన్న భయాలు నా లిమిట్స్ లో ఉంటాయి.
ఈ ప్రయాణంలో నా కోసం నిలిచిన నా ఫ్రెండ్స్ కి ధన్యవాదాలు అని రాసుకొచ్చింది మంజు వారియర్.