సనాతన ధర్మంలో దానధర్మాలు ( Charities )చేయడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు.దానధర్మాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలోనూ ఆ దాన ధర్మాల ఫలితం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో చేసిన దాన ఫలాలను మరణం తర్వాత కూడా పొందగలడని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే ఒక శ్లోకంలో దానధర్మాల ప్రాముఖ్యతనీ అవి ఎప్పుడు చేయాలో సమగ్రంగా వివరించారు.
గరుడ పురాణం( Garuda Puranam )లో చెప్పినట్లు పేదరికంలో ఉన్నప్పుడు దానధర్మాలు చేయకూడదు.పేదవాడిగా ఉన్నప్పుడు దానం చేయడం వల్ల మరింత పేదవాడిగా( poor) మారవచ్చు.అలాగే మీ ప్రతిష్ట కోసం దానధర్మాలు చేయడం అస్సలు మంచిది కాదు.సంపదకు మించిన దానం( donation ) ఇవ్వడం మీకు కూడా భారం కావచ్చు.ఒక వ్యక్తి తన సంపాదించిన డబ్బు లేదా సంపాదనలో 10% మాత్రమే ధనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.అంతేకాకుండా మీరు చేసే దానం అవతలి వ్యక్తికి అత్యవసరమైనప్పుడే చేయాలని అప్పుడే మీరు చేసిన దానికి తగిన ఫలితం లభిస్తుందని స్పష్టం చేశారు.
ధనం లేనప్పుడు బాధపడడం ధనం ఉన్నప్పుడు నాకంటే పెద్దవాడు ఎవడు లేడని పొంగిపోవడం లాంటివి చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.తల్లిదండ్రులు పిల్లలకు ఎప్పుడూ కూడా పెద్దలను గౌరవించేలా ఎవరితోనైనా మర్యాదగా ప్రవర్తించేలా వారిని సంస్కారవంతులుగా తయారు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.మీ స్వలాభం కోసం ఎవరికీ చెడు చేయకూడదు.అంతేకాకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల పాప భారం పెరుగుతుందని గుర్తుంచుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే మోసం, అన్యాయం చేసి వ్యక్తులతో కలిసి ఉండకుండా, అలాంటివారికి దూరంగా ఉండటమే మంచిది.ఎప్పుడు కూడా మంచి వ్యక్తులు, నిజాయితీపరులతోనే స్నేహం చేయడం ఎంతో మంచిది.