అక్కినేని యువ హీరోల్లో ఒకరైన అఖిల్ ( Akhil Akkineni ) ఇప్పుడు తరచు వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.అందుకు కారణం ఈయన నటించిన ఏజెంట్ (Agent Movie) సినిమా అనే చెప్పాలి.
సురేందర్ రెడ్డి ( Surender Reddy ) దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కింది.యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా రిజల్ట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.
మరి మరో వారం రోజుల్లో ఈ సినిమా రిజల్ట్ తేలిపోనుంది.గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం అఖిల్ తో పాటు టీమ్ అంతా కష్టపడుతూనే ఉంది.
మరి ఎట్టకేలకు పలు వాయిదాల తర్వాత ఏప్రిల్ 28న ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు.

అయితే మొన్నటి వరకు ఈ సినిమా అడపాదడపా ప్రమోషన్స్ మినహా పెద్దగా చేసింది లేదు.ఇక రిలీజ్ కు దగ్గర పడేకొద్దీ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ తప్పకుండ బ్లాక్ బస్టర్ అవుతుంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తుండడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ మాట్లాడుతూ.ఎప్పటి నుండో ఇటువంటి అద్భుతమైన కథ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని.డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా కోసం తనకు అందించిన సపోర్ట్ ఎప్పటికి మర్చిపోలేనని.
అలాగే తన నుండి ఎటువంటి సినిమాలు కావాలని ఆడియెన్స్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారో ఇకపై అటువంటి సినిమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తానని తెలిపారు.

ఇక ఏజెంట్ సినిమాను సురేందర్ 2 సినిమాస్ తో కలిసి ఏకే ఎంటెర్టాన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో ఈయనకు జోడీగా సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే కీలక పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ( Mammootty ) నటిస్తున్నాడు.
హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తుండగా ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.మరి అఖిల్ రెండేళ్ల కష్టానికి ఈ సినిమా ఆశించిన ఫలితం ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.







