మహేష్ సినిమా ఎంతో ప్రత్యేకమైనది.. మహేష్ త్రివిక్రమ్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్?

మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.

 Mahesh Movie Is Very Special Movie Maker Given Update On Mahesh Trivikram Movie,-TeluguStop.com

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

మహేష్ బాబు సూచనల మేరకు స్క్రిప్టు లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తుందని చెప్పినప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ అయిన ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలోని ఈ విధంగా సినిమా అప్డేట్ కోసం నెటిజన్ చేసిన ట్వీట్ పై మేకర్స్ స్పందించారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అభిమానుల ఆతృత మేము అర్థం చేసుకోగలం ఏదైనా సమయం వచ్చినప్పుడు చెబితేనే శ్రేయస్కరంగా ఉంటుంది.అందుకే ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అందించలేక పోతున్నాము.

Telugu Mahesh Babu, Naga Vamsi, Nirmathanaga, Telugu, Tollywood, Trivikram-Movie

మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దాదాపు 12 సంవత్సరాల తర్వాత సినిమా రావడంతో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది.అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకమైన రోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని,కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మహేష్ బాబు గురించి తెలియ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube