మహేష్ సినిమా ఎంతో ప్రత్యేకమైనది.. మహేష్ త్రివిక్రమ్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన మేకర్స్?

మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమాతో ఎంతో మంచి విజయాన్ని అందుకున్నారు.

ఈ క్రమంలోనే ఈయన తన తదుపరి 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు.ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.

మహేష్ బాబు సూచనల మేరకు స్క్రిప్టు లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తుందని చెప్పినప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ అయిన ఇవ్వండి అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మహేష్ బాబు అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.

ఈ క్రమంలోని ఈ విధంగా సినిమా అప్డేట్ కోసం నెటిజన్ చేసిన ట్వీట్ పై మేకర్స్ స్పందించారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అభిమానుల ఆతృత మేము అర్థం చేసుకోగలం ఏదైనా సమయం వచ్చినప్పుడు చెబితేనే శ్రేయస్కరంగా ఉంటుంది.

అందుకే ఎప్పుడు పడితే అప్పుడు అప్డేట్స్ అందించలేక పోతున్నాము. """/" / మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో దాదాపు 12 సంవత్సరాల తర్వాత సినిమా రావడంతో ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైనది.

అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని ప్రత్యేకమైన రోజు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని,కచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా నిర్మాత నాగ వంశీ మహేష్ బాబు గురించి తెలియ చేశారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాలలో కూడా నటించారా.. ఏ సినిమాలో తెలుసా? .