వన్ మిలియన్ రీల్స్ తో రికార్డులు సృష్టిస్తున్న కుర్చీ మడత పెట్టే సాంగ్?

త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మహేష్ బాబు, శ్రీ లీలా( Mahesh Babu, Sri Leela ) కలిసిన నటించిన తాజా చిత్రం గుంటూరు కారం( Guntur karam ).ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

 Mahesh Babu Guntur Karam Movie Kurchi Madatha Petti Song Rare Record, Guntur Kar-TeluguStop.com

అంతేకాకుండా ఈ సినిమా మీద అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకోగా డైరెక్టర్ త్రివిక్రమ్ ( Director Trivikram )అంచనాలను తలకిందులు చేసేసారు.ఈ సినిమా యావరేజ్ టాక్ తో నడిచింది.

మహేష్ బాబు సినిమా కాబట్టి బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి.ఇకపోతే ఈ మూవీలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే.

Telugu Guntur Karam, Kurchimadatha, Kurchi Rare, Mahesh Babu, Shekar Master, Sre

ఈ సాంగ్ మాత్రం నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పాలి.మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ( Thaman )సంగీతం అందించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల వేసిన స్టెప్పులు.ఆ ఊపు చూసి సూపర్ స్టార్ కూడా షాక్ తిన్నారంటే మామూలు విషయం కాదు.శ్రీలీల డాన్స్స్ ఆమె ఎనర్జీ గురించి ప్రీరిలీజ్ ఫంక్షన్ లో స్పెషల్ గా గుర్తు చేసుకున్నారు మహేష్ బాబు.

ఇక ఈసారి మహేష్ కుడా కుర్చీ సాంగ్ కు అదరిపోయే స్టెప్పులు వేశారు.శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.స్టార్ హీర్లకు సిగ్నేచర్ స్టెప్పులు ఇవ్వడంలో దిట్ట శేఖర్ మాస్టర్.ఈ కుర్చీ సాంగ్( Chair Song ) తో ఆయనో మెట్టు ఎక్కేశారు కూడా.

Telugu Guntur Karam, Kurchimadatha, Kurchi Rare, Mahesh Babu, Shekar Master, Sre

ఇది ఇలా ఉంటే కుర్చీమడత పెట్టి సాంగ్ రికార్డ్ మీద రికార్డ్ లు సృష్టిస్తోంది.ప్రస్తుతం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్,ట్విట్టర్ ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ పాట ఎక్కువగా వినిపిస్తోంది.వ్యూస్ పరంగా కూడా ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.తాజాగా రీల్స్ పరంగా కూడా రికార్డు నెలకొల్పింది.ఏదైనా సినిమా నుంచి హిట్ సాంగ్ వస్తే.దాన్ని రీల్స్ గా చేయడం అలవాటుగా మారింది.

పాపులర్ సాంగ్స్ ను రీల్స్ ద్వారా ఇంకా పాపులర్ చేసేస్తున్నారు.తాజాగా కుర్చి మడతపెట్టి సాంగ్ కూడా ఇలాగే ఇంకా పాపలర్ అయ్యి రీల్స్ పరంగా కూడా రికార్డ్ సృష్టించింది.

ఇన్ స్టాలో కుర్చీ మడతపెట్టి పాటకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది.ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి వన్ మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి.

ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి.ఈ పాటకి అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube