ఇప్పటి వరకు వందల్లో ఇక నుండి వేలల్లో.. మహేష్‌ నువ్వు దేవుడివి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించనున్న విషయం తెలిసిందే.చిన్నారుల గుండె ఆపరేషన్ అంటే లక్షలు ఖర్చు అవుతుంది.

 Mahesh Babu Foundation For Children Hearts Details, Mahesh Babu, Mahesh Babu Fou-TeluguStop.com

దాంతో ఎంతో మంది పేద వారు తమ పిల్లలకు గుండె సమస్య లు వచ్చిన సమయంలో ఏం చేయాలో పాలు పోక కన్నీరు పెట్టుకున్నారు.వారందరికీ తనవంతు సాయం అనే ఉద్దేశంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించిన విషయం తెలిసిందే.

మహేష్ బాబు ఇప్పుడు ఆ సంఖ్యను మరింతగా పెంచుతున్నాడు.ఇప్పటి వరకు వ్యక్తిగతంగా చేసిన సాయం ఇక నుండి ఛారిటీ ద్వారా చేస్తూ వేల మంది చిన్నారుల గుండెలకు ఊపిరి ఊదే ప్రయత్నాలు చేసేందుకు గాను ఆయన మహేష్ బాబు పౌండేషన్ స్థాపించడం జరిగింది.

ప్యూర్ లిటిల్ హార్ట్స్ పౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను మహేష్ బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇకపై చిన్నారుల గుండెలకు మరింతగా తాను బాసటగా నిలుస్తా అన్నట్లుగా హామీ ఇచ్చారు.

దీంతో మహేష్ బాబు అభిమానులు ఆయన దేవుని కంటే ఎక్కువ అన్నట్లుగా పూజిస్తున్నారు.

Telugu Childrens, Heart, Mahesh Babu, Pure, Rajamouli-Movie

ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమాల్లో సూపర్‌ స్టార్ కానీ ఇప్పటి నుండి ఆయన రియల్ సూపర్ స్టార్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్.ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.పరశురామ్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో మహేష్ బాబు నటించబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాల తర్వాత టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తో ఒక భారీ సినిమా మహేష్ బాబు చేయాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube