జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానమైన కన్నెపల్లి లక్ష్మి పంపూ హౌస్ ను సందర్శించడానికి హైదరాబాద్ నుండి కాళేశ్వరంకు వస్తున్న తీన్మార్ మల్లన్నను మహాదేవపూర్ లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరుగిన అవినీతి ప్రజలకు తెలియజేయాల్సిదే అన్నారు.
ఇప్పుడు ఉన్న పరిపాలనాకు పాపాలు ఎక్కువ అవుతున్నాయి అంటూ నేను కాళేశ్వరం ముక్తీశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తాను గోదావరి స్నానం చేసి వస్తాను అంటూ నాకు మీరు అవసరం అయితే సేక్కురిటిగా రాండి నేను కన్నెపల్లి లక్ష్మీ పంపూ హౌస్ కు వెళ్ళాను అంటూ పోలీసులతో అన్నాడు పోలీసులు అతను చెప్పిన వినకుండా పోలిస్ స్టేషన్ తరలించారు.