అంటే నజ్రియా కు ఇంకో ఆఫర్‌ రానే లేదా!

తమిళం మరియు మలయాళ సినిమా లతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అనే విషయం తెల్సిందే.తెలుగు లో ఈమె సినిమా ఎప్పుడు చేస్తుందా అంటూ ఎదురు చూసిన వారి కోసం అన్నట్లుగా అంటే సుందరానికి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Nazriya Nazim Telugu Films Not Yet Happen , Ante Sundaraaniki , Film News , Na-TeluguStop.com

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఖచ్చితంగా ఈమెకు వరుసగా ఆఫర్లు వచ్చి ఉండేవి.కాని ఇప్పుడు వరుస ఆఫర్ల విషయం ఏమో కాని తెలుగు లో తదుపరి సినిమా చేసే అవకాశాలు రావడం లేదు.

తెలుగు లో ఈమె కనీసం రెండవ ఆఫర్‌ ను ఇప్పటి వరకు దక్కించుకోలేదు అనేది టాక్.కాని మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె వద్దకు రెండు మూడు ఆఫర్లు వచ్చాయి.

వాటిని కథ సరిగా లేదేని అన్నదట.ఒక యంగ్‌ స్టార్‌ హీరో కు జోడీగా ఈమెకు నటించే అవకాశం దక్కిందట.

కాని ఈమె మాత్రం ఆ ఆఫర్ కు నో చెప్పిందట.కథ విన్న తర్వాత నో చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇంకా కొన్ని కథలు కూడా విన్న ఈమె నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం నజ్రియా రెండు మూడు తమిళ సినిమా ల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.మలయాళ సినిమా లో కూడా ఈమె నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.హీరోయిన్ గా నజ్రియా తెలుగు లో చేయబోతున్న సినిమా ఏంటీ అనేది చూడాలి.

తెలుగు లో రెండు మూడు ఆఫర్లు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయని.త్వరలోనే వాటిల్లో ఒక్క దాన్ని కన్ఫర్మ్‌ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం నజ్రియా వైవాహిక జీవితంను ఎంజాయ్ చేస్తుంది.అందుకే ఈమె తెలుగు లో ఎక్కువ సినిమాలు చేయడం లేదని అంటున్నారు.

స్కిన్‌ షో కు ఈమె నో చెప్పడం వల్లే ఆఫర్లు రావడం లేదనే కామెంట్స్‌ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube