నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”.ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది.ఈ నేపథ్యంలో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి టీమ్.
ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు కింగ్ నాగార్జున, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కేఎస్ రామారావు, డి సురేష్ బాబు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.
లవ్ స్టోరి సినిమా సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను.థియేటర్ లలో సినిమా మ్యాజిక్ మళ్లీ లవ్ స్టోరితో తిరిగొచ్చేసింది.
శేఖర్ కమ్ములకు ఇది ఎంత ఇంపార్టెంట్ మూవీనో నాకు తెలుసు.వెల్ డన్ శేఖర్ కమ్ముల.
నారాయణదాస్ నారంగ్, సునీల్, రామ్మోహన్ కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్.నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు.సంగీతం సూపర్బ్ గా వచ్చింది.థియేటర్ లలో సినిమా మ్యాజిక్ ఇంకా ఉంది ఉంటుంది అని ప్రూవ్ చేసిన లవ్ స్టోరి టీమ్ అందరికీ థాంక్స్.అన్నారు.
నిర్మాత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ.
అందరికీ నమస్తే.నా ఫ్రెండ్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా లవ్ స్టోరిని నిర్మించి, విడుదల చేయడం సంతోషంగా ఉంది.
సినిమా అద్భుతంగా ప్రదర్శితం అవుతోంది.చాలా సంతోషంగా ఉంది.
ఇండస్ట్రీ ఇప్పుడు లవ్ స్టోరితో ఓపెన్ అయ్యిందని అనుకుంటున్నాను.లవ్ స్టోరి సక్సెస్ కావడం టాలీవుడ్ కు శుభ పరిణామం.
ఇప్పుడు చాలా సినిమా మా సినిమా సక్సెస్ చూసి రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి.ఎంటైర్ టీమ్ కు, నాగార్జున గారికి థాంక్స్.
అన్నారు.