ఎల్వీఎం -3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ఒకేసారి 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.ఈ క్రమంలో 64 టన్నుల ఎల్వీఎం- 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.1200 కిలోమీటర్ల ఎత్తులోకి ఈ 36 ఉపగ్రహాలు వెళ్లాయి.కాగా ఈ ప్రయోగం ద్వారా తొలిసారి ప్రపంచ వాణిజ్య విపణీలోకి ఇస్రో చేరింది.యూకే తో 108 ఉపగ్రహాలకు ఇస్రో ఒప్పందం చేసుకుంది.దీనిలో భాగంగానే తొలి విడతలో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది.2023 మార్చి లోపు మరో నాలుగు ప్రయోగాలు ఇస్రో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు