ఎల్వీఎం-3 రాకెట్ ప్రయోగం విజయవంతం

ఎల్వీఎం -3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి ఒకేసారి 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

ఈ క్రమంలో 64 టన్నుల ఎల్వీఎం- 3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.1200 కిలోమీటర్ల ఎత్తులోకి ఈ 36 ఉపగ్రహాలు వెళ్లాయి.

కాగా ఈ ప్రయోగం ద్వారా తొలిసారి ప్రపంచ వాణిజ్య విపణీలోకి ఇస్రో చేరింది.

యూకే తో 108 ఉపగ్రహాలకు ఇస్రో ఒప్పందం చేసుకుంది.దీనిలో భాగంగానే తొలి విడతలో 36 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

ఈ ఏడాదిలో పీఎస్ఎల్వీ, ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేపట్టనుంది.2023 మార్చి లోపు మరో నాలుగు ప్రయోగాలు ఇస్రో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

నా కూతురిలో అమ్మను చూసుకున్నా.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!