ఇటీవల కాలంలో ప్రేమ, పెళ్లి, విడాకులు చాలా కామన్ అయిపోయాయి.ముఖ్యంగా ఒకరిని ప్రేమించి.
మరొకరిని పెళ్లి చేసుకుని.చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
తాజాగా తన ప్రేమను, ప్రేమించిన ప్రియుడిని పక్కన పెట్టి.పెద్దలు చెప్పిన యువకుడిని పెళ్లాడిన యువతి చివరకు ఒంటరిగా మిగిలిపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.తెలంగాణలోని హుజూరాబాద్‌లో దివ్య అనే యువతి.హుజూరాబాద్‌కే చెందిన వంశీ అనే యువకుడు ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
ఈ విషయం తెలియని తల్లదండ్రులు దివ్యకు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయించారు.పెద్దల మాట కాదనలేకపోయిన దివ్య.
పెళ్లికి అంగీకరించింది.దివ్య పెళ్లి విషయం తెలుసుకున్న వంశీ.
ఎలాగైనా ఆపాలని ప్రయత్నించాడు.కానీ, అది కుదరలేదు.
సోమవారం అంగరంగ వైభవంగా దివ్య పెళ్లి జరిగింది.ఇక పెళ్లి తంతు ముగిశాక.బరాత్‌తో నవ వధూవరులు ఇంటికి బయలుదేరారు.ఈ విషయం తెలుసుకున్న వంశీ బాగా తాగేసి.
వధూవరులు వెళ్లే రోడ్డులో కాపుకాశాడు.ఇక అనుకున్నట్టుగానే వధూవరులు వెళ్లే వాహనాన్ని అడ్డగించి.
నానా రచ్చ చేశారు.ఈ క్రమంలోనే నవ వధువును కిందకు దింపి.
వరుడి ఎదుటే ఆమెకు ముద్దుపెట్టాడు వంశీ.అంతేకాకుండా.
దివ్యను నాతో పంపమంటూ గొడవకు దిగాడు.
అది సహించలేని వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో వధూవరులకు మరియు వంశీకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా మారలేదు.ఇక చివరకు వధువును అక్కడే వదిలేసి వరుడు వెళ్లిపోయి షాక్ ఇచ్చాడు.
మరోవైపు తల్లిదండ్రులు కూడా కుమార్తెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.ప్రస్తుతం వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఒంటరిగా మిగిలిన వధువును స్వధార్ హోంకు తరలించారు.