అమెరికాలోని అరోజోనా లో జరిగిన ఓ సంఘటన అందరిని షాక్ కి గురిచేసింది.పోలీసులకే మస్కా కొట్టిన ఓ యువతి ఏకంగా పోలీస్ కారునే దొబ్బేసి ఉడాయించింది,ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాలలోకి వెళ్తే.ఆరిజోనా పోలీసులకి ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఎవరో ఒక అమ్మాయి రోడ్డు పక్కనే బట్టలు లేకుండా నిలబడి ఉందని, స్థానికంగా ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
దాంతో హుటాహుటిన ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చిన పోలీసులు ఆమెకి ఓ దుప్పటి ఇచ్చారు.
అది కప్పుకోమని చెప్పి ఆమెతో మాటలు కలుపుతున్నారు.ఈ క్రమంలోనే ఆమె ఒక్క సారిగా పరుగు పరుగున పోలీసు కారులోకి ఎక్కి రయ్యిమని వెళ్లి పోయింది.
ఒక్క సారిగా షాక్ అయిన పోలీసులు వెంటనే మరో కారులో ఆమెని వెంబడించడం మొదలు పెట్టారు.అయినా.
ఆమె తీవ్రమైన వేగంతో నగ్నంగానే కారులో చాలా వరకూ ప్రయాణం చేసింది.ఈ క్రమంలోనే పోలీసులు ఆమెపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించినా ఉపయోగం లేకుండా పోయింది.కానీ కారుకి అనుకోకుండా పంచర్ పడటంతో ఆమె పోలీసులకి దొరికిపోయింది.దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికా లోని అరిజోనాలో ఈ వింత కేసు బయటపడింది.పోలీసులను మోసం చేసి ఓ మహిళ పోలీస్ కారును దొంగిలించింది.పోలీస్ లను ముప్పు తిప్పలు పెట్టి చివరకు కారు పంక్చరు కావడం తో వారికి పట్టుబడింది.మిర్రర్ నివేదిక ప్రకారం, ఫోన్‌లో ఎవరో ఒకరు బట్టలు లేని ఒక మహిళ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారని అరిజోనా పోలీసులకు పిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు పెట్రోల్ స్టేషన్‌కు చేరుకున్నారు, అక్కడ మహిళ బట్టలు లేకుండా నిలబడి ఉంది.పోలీసులు మొదట ఆ మహిళకు తనను తాను కవర్ చేసుకోవటానికి ఒక దుప్పటి ఇచ్చారు, తరువాత వారు ఆ మహిళ ఈ స్థితిలో ఉండటానికి కారణం అడిగారు.తనపై అత్యాచారం జరిగిందని ఆ మహిళ పోలీసులకు తెలిపింది.పోలీసులు ఆమెను ఓదార్చడానికి ముందే, ఆ మహిళ త్వరగా ముందుకు వెళ్లి పోలీసు కారులో కూర్చుంది.
పోలీసులు ఆమెను అర్థం చేసుకోకముందే, ఆమె కారు వేగాన్ని పెంచి గంటకు 100 కి మీ కి పైగా వేగంతో పోలీసు కారును నడుపుతూ అక్కడి నుంచి తప్పించుకుంది.పోలీసు అధికారులకు ఏమీ అర్థం కాలేదు.వారు వెంటనే మరో కారులో ఆమెను వెంబడించడం ప్రారంభించాడు.నగ్నం గా డ్రైవింగ్ చేస్తున్న ఓ మహిళ తన వేగాన్ని మరింత పెంచుకుని పోలీసులను చాలా గంటలు తన వెనుక తిప్పించు కుంది తన కారు చక్రం పంక్చర్ అవడాం తో ఆగిపోయింది .
పోలీసు మహిళను ఆపడానికి అనేక రౌండ్ల రబ్బరు బుల్లెట్ల తో కాల్పులు జరిపారు.మహిళను అరెస్టు చేసి పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు ప్రారంభించారు.
.