కొత్త సీసాలో పాత సారా సామెతను కాలం చెల్లింది.కలికాలం లో సారా విక్రయాలకు ఏకంగా పైప్ లైన్ వేశారు ఇద్దరు ప్రభుద్దులు.
ఈ హైటెక్ వ్యాపారం ఎక్కడో ఏజెన్సీ ప్రాంతంలో కాదు.రాజమహేంద్రవరం నగరానికి అతి దగ్గర్లోని బుర్రిలంక గ్రామంలో జగుతుంది.
పైప్ లైన్ లో సారా వ్యాపారం గురించి తెల్సుకొన్న అధికారులు విస్తుపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో మందుబాబులు చౌక ధర కు దొరికే సారా కు బానిసలయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలో సారా తయారీ కుటీర పరిశ్రమ గా మారిపోయింది.ఎంతలా అప్ డేట్ అయిందో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ని కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయతీ పరిధిలోని బుర్రిలంక లో పైప్ లైన్స్ లో సారా వ్యాపారం చూస్తే అర్థం చేసుకోవచ్చు.
ఇద్దరు వ్యక్తులు సారా తయారు చేస్తున్నారని రాజమహేంద్రవరం ఎస్ ఈ బీ అధికారులకు పక్కా సమాచారం రావడంతో ఎక్సయిజ్,పోలీస్,రెవెన్యూ అధికారుల బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుoది.ఈ దాడుల్లో ఎస్.ఐ
.