Lee Anderson : లండన్ మేయర్‌పై ఇస్లామిస్ట్ వ్యాఖ్యలు .. లీ ఆండర్సన్‌ను సస్పెండ్ చేసిన రిషి సునాక్ పార్టీ

లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై( London Mayor Sadiq Khan ) చేసిన వ్యాఖ్యలకు గాను క్షమాపణలు చెప్పడానికి నిరాకరించినందుకు బ్రిటన్ కన్జర్వేటివ్‌లు శనివారం తమ మాజీ డిప్యూటీ ఛైర్మన్‌ను పార్లమెంటరీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.చట్టసభ సభ్యుడు లీ ఆండర్సన్‌( Lee Anderson ) శుక్రవారం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని ప్రధాని రిషి సునాక్‌( UK PM Rishi Sunak ) పార్టీపై ఒత్తిడి పెరిగింది.

 Lee Anderson Suspended From Rishi Sunaks Party Over Islamists Remarks On Sadiq-TeluguStop.com

ఇది జాత్యహంకార, ఇస్లామోఫోబిక్( Islamophobic ) అంటూ దుమారం రేగింది.గతేడాది అక్టోబర్‌లో గాజాలో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి యూకే వ్యాప్తంగా ఇస్లామోఫోబియా, యూదు వ్యతిరేక ఘటనలు అనూహ్యంగా పెరిగాయి.

ఈ క్రమంలోనే లండన్ మేయర్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో చీఫ్ విప్ లీ ఆండర్సన్‌ను ఎంపీ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు టోరీ శాసనసభ్యుడు సైమన్ హార్ట్ తెలిపారు.హార్ట్ చీఫ్ విప్ పదవి అంతర్గత కన్జర్వేటివ్ పార్టీ( Conservative Party ) క్రమశిక్షణకు బాధ్యత వహిస్తుంది.మితవాద జీబీ న్యూస్ ఛానెల్‌లో ఆండర్సన్ మాట్లాడుతూ .2016లో లండన్‌లో మొదటిసారి ఎన్నికైనప్పుడు పాశ్చాత్య రాజధానికి మొదటి ముస్లిం మేయర్‌గా వున్న ఖాన్‌పై ఇస్లామిస్టులు నియంత్రణ సాధించారని వ్యాఖ్యానించారు.

Telugu Conservative, Islamophobic, Lee Anderson, Leeanderson, London, Londonmayo

ఆండర్సన్ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కన్జర్వేటివ్ వాణిజ్య మంత్రి నస్ ఘనీ, సీనియర్ బ్యాక్‌బెంచర్ సాజిద్ జావిద్, టోరీ పీర్ గావిన్ బార్వెల్ వ్యాఖ్యలను ఖండించిన టోరీలలో వున్నారు.పార్లమెంట్‌లో స్వతంత్ర శాసనసభ్యుడిగా కూర్చునే ఆండర్సన్ .శనివారం ఆలస్యంగా తన వ్యాఖ్యలు పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టాయన్నారు.కానీ క్షమాపణలు చెప్పేందుకు మాత్రం ఆండర్సన్ నిరాకరించారు.ఈ వివాదంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు.

Telugu Conservative, Islamophobic, Lee Anderson, Leeanderson, London, Londonmayo

ఈ పరిస్ధితుల్లో విప్‌ను సస్పెండ్ చేయడం తప్పించి మరో మార్గం లేదని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.ఏదేమైనప్పటికీ తీవ్రవాదం ఏ రూపంలో వున్నా నిలువరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తాను మద్ధతు ఇస్తూనే వుంటానని రిషి సునాక్ వెల్లడించారు.ఇస్లామిస్టులు, తీవ్రవాదులు , సెమిట్ వ్యతిరేకులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ ఇటీవల ఒక వార్తాపత్రిక కథనంలో మాజీ అంతర్గత మంత్రి సుయెల్లా బ్రేవర్‌మాన్( Suella Braverman ) చేసిన వ్యాఖ్యల తర్వాత ఆండర్సన్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube