వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.
తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.
అన్ని రకాలుగా ప్రోత్సహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.
సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.
ఇందుకు ఎన్నో ఉదాహరణలు.భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.
ఇక భారతీయులను అమెరికన్లు ఎంతగానో ప్రేమిస్తారు.కష్టాల్లో వున్న మనవారిని ఎందరో ఆదుకున్నారు.
మన భారతీయ పద్ధతులను, సంస్కృతులను అమెరికన్లు బాగా పాటిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికన్లు, భారతీయుల మధ్య అనుబంధం దృఢ పడుతోంది.
ఇప్పటికే అగ్రరాజ్యంలో ఎన్నో రంగాల్లో భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.
ఈ నేపథ్యంలో అమెరికా అభివృద్ధిలో భారతీయులది కీలక పాత్ర అనడానికి తాజా సెన్సస్ గణాంకాలే నిదర్శనమన్నారు భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి.

తాజా జనాభా లెక్కల ప్రకారం.4 మిలియన్లకు పైగా వున్న అమెరికా జనాభాలో 1.3 శాతం మంది ఇండో అమెరికన్లేనని ఆయన చెప్పారు.వీరంతా అమెరికా సాంస్కృతిక, ఆర్ధిక విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారని రాజా కృష్ణమూర్తి అన్నారు.భారత సంతతి కమ్యూనిటీ అమెరికాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న జాతి సమూహాలలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు.2010 నుంచి ఇది ఏకంగా 40 శాతానికి పెరిగిందని రాజా కృష్ణమూర్తి గుర్తుచేశారు.
యూఎస్‌లో ప్రస్తుతం 80 శాతం మంది భారతీయ అమరికన్లు కళాశాల డిగ్రీని కలిగి వున్నారని.
ఏ సమాజంలోనైనా అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగివున్నారని ఆయన తెలిపారు.కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్‌లతో పాటు అత్యంత ప్రధాన రంగాలలో భారతీయులు ఉనికిని కలిగి వున్నారని.
అలాగే అమెరికన్ వైద్యులలో 10 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారేనని రాజా కృష్ణమూర్తి చెప్పారు.ఈ గణాంకాలు అమెరికాలో భారతీయ కమ్యూనిటీ విజయాలకు నిదర్శనమని ఆయన అన్నారు.
అయితే అమెరికా పౌర సమాజంలో మనం చేయవలసింది ఇంకా వుందన్నారు రాజా కృష్ణమూర్తి.

ప్రధానంగా రాజకీయాల్లో భాగం పంచుకోవాలని ఎక్కువ మంది భారతీయ అమెరికన్లు భావిస్తున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ఇదే సమయంలో భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఉపాధ్యక్షురాలు కావడం ఒక గొప్ప విజయమని.ఈ విషయంలో మనం చాలా ముందడుగు వేశామని రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
భారతీయ అమెరికన్లు ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారని ఆయన అన్నారు.కఠినమైన పరిస్ధితుల మధ్య అమెరికాకు వలస వచ్చి.కృషి, ఉన్నత విద్యతో పాటు ఇక్కడ అవకాశాలు అందిపుచ్చుకోవడం వల్ల భారతీయ సమాజం అభ్యున్నతికి దోహదపడ్డాయని రాజాకృష్ణమూర్తి పేర్కొన్నారు.