ఎన్టీఆర్ సినిమాల ఫ్రీ రిలీజ్ అంటే సుమకు నచ్చవా... అసలు విషయం బయటపెట్టిన రోషన్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇలా ప్రమోషన్ ల నుంచి మొదలుకొని ఇంటర్వ్యూలు సక్సెస్ మీట్, ప్రీ రిలీజ్ అంటూ పెద్ద ఎత్తున సినిమా ఫంక్షన్లను నిర్వహిస్తూ ఎంతో హడావిడి చేస్తూ తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు.

 Latest News About Anchor Suma Kanakala, Suma Kanakala, Roshan Kanakala, Tollywoo-TeluguStop.com

అయితే ఇలా సినిమాకు సంబంధించిన ఏ వేడుక జరిగినా అక్కడ యాంకర్ గా సుమ ( Suma ) ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.ఇక ఈమె అందుబాటులో లేకపోతే ఇతర యాంకర్లను తీసుకుంటూ ఉంటారు అయితే సినిమా ఈవెంట్లకు సుమానే ఫస్ట్ ఆప్షన్ అనే సంగతి మనకు తెలిసిందే.

ఫీల్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమా కనకాల తన కుమారుడు రోషన్ ( Roshan ) ను త్వరలోనే హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఈయన బబుల్ గమ్( Bubble Gum )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈ సినిమాను సుమ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.అంతేకాకుండా తాను ఏ ఈవెంట్ కి వెళ్లిన అక్కడికి కూడా తన కొడుకుని తీసుకువెళ్తూ తన కుమారుడు నటిస్తున్న బబుల్ గమ్ సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

Telugu Jr Ntr, Roshan Kanakala, Suma Kanakala, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుమ తన కొడుకు రోషన్ తో కలిసి చిట్ చాట్ చేశారు.రోషన్ అడిగే ప్రశ్నలకు సుమా సమాధానాలు ఇచ్చారు.ఈ క్రమంలోనే రోషన్ తన తల్లి సుమని ప్రశ్నిస్తూ మీకు ఏ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం అంటే చాలా ఇష్టం అంటూ ఆప్షన్స్ కూడా ఇచ్చారు.మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ నాని ఈ హీరోల సినిమాలలో ఏ హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం ఇష్టం అని చెప్పడంతో… తనకు ముందుగా సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేసే అవకాశం కల్పించినటువంటి హీరో ఎన్టీఆర్ ( Ntr )అని స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కోసం తనని సంప్రదించారని ఈమే తెలియజేశారు.

అలాగే మహేష్ బాబు రామ్ చరణ్ సినిమాలకు కూడా తాను యాంకర్ గా చేశానని తెలిపారు.కానీ నాకు నాని ( Nani ) సినిమాల ప్రీ వేడుకలకు యాంకరింగ్ చేయడం అంటే ఇష్టం అని తెలిపారు.

Telugu Jr Ntr, Roshan Kanakala, Suma Kanakala, Tollywood-Movie

నాని సినిమాకు నేను యాంకర్ గా చేస్తున్నాను అంటే ముందు రోజు కూర్చుని నేను నాని ఆ ఈవెంట్ కోసం అన్ని డిస్కస్ చేసుకుంటామని అందుకే నాకు ఆయన సినిమాకు యాంకర్ గా వ్యవహరించడం ఇష్టం అంటూ సమాధానం చెప్పారు.దీంతో రోషన్ ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ వేడుకలకు యాంకర్ గా చేయడం ఇష్టం లేదంటున్న సుమ అంటూ కామెంట్స్ చేశారు దీంతో ఒక్కసారిగా సుమ షాక్ అయ్యారు.ఇక రాజీవ్ కనకాలను( Rajeev Kanakala )పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది అంటూ కూడా రోషన్ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు సుమ కూడా ఫన్నీ సమాధానం చెప్పుకువచ్చి నాకు కాస్త ముందు చూపు ఎక్కువ కదా రాజీవ్ ను పెళ్లి చేసుకుంటే రోషన్ లాంటి కొడుకు పుడతారని భావించి ముందు చూపుతోనే తనని పెళ్లి చేసుకున్నాను అంటూ సమాధానం చెప్పారు.

ఏది ఏమైనా సుమ మాత్రం తన కొడుకు సినిమాని భారీ స్థాయిలోనే ప్రమోట్ చేస్తున్నారని తన కొడుకు సినిమా కోసం స్టార్ సెలబ్రిటీలు అందరిని కూడా రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube