టాలీవుడ్ ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో జరిగాయి.అశేష జనవాహని మధ్య అంతిమ యాత్ర సాగగా.
కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం చేశారు.అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు.
తమ నటుడు ఇక లేడన్న నిజాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.ఆయన మరణంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనారోగ్య కారణంగా కృష్ణ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో కృష్ణ భౌతికకాయాన్ని మొదట గచ్చిబౌలిలోని ఆస్పత్రి నుంచి నానక్ రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు.
కృష్ణ పార్థివదేహానికి.పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.