అత్యధికంగా వలస కార్మికులు వెళ్ళే దేశాలు ఎవనంటే కువైట్, సౌదీ ఇలాంటి అరబ్ దేశాల పేర్లు ముందు వరుసలో ఉంటాయి.వాటి తరువాతే అమెరికా, బ్రిటన్ లు అత్యధికంగా వలస వాసులను కలిగిన దేశాలుగా ఉన్నాయి.
అయితే అన్ని దేశాలతో పోల్చితే కువైట్ లో ఉండే వలస వాసుల సంఖ్య పెద్దదే, ముఖ్యంగా ఇక్కడ ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉంటారు.ఏళ్ళ తరబడి కార్మికులుగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
అయితే ఇలా తమ దేశం వచ్చిన ప్రవాసులు ఎంతో మంది అత్యధిక వాహనాలు కలిగి ఉంటున్నారని, ప్రభుత్వ ఖజానాకు వీరి వలన తీవ్ర నష్టం వాటిల్లోతోందని భావించిన కువైట్ సరికొత్త చట్టాన్ని అమలు చేయడానికి సిద్దపడింది.
కువైట్ లో ఉండే ప్రవాసుల వాహనాల పై పరిమితిని విధించడమే ఈ కొత్త చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఇప్పటి వరకూ కువైట్ లో ఇలాంటి పరిమితి వాహనాలు అనే చట్టం ఎప్పుడు లేదు, కానీ కొందరు ప్రవాసులు ఒక్కొక్కరూ దాదాపు 50 కి పైగా వాహనాలు కలిగి ఉంటున్నారని, కొన్ని సొంతగా ఉపయోగించుకుంటుంటే మరికొన్ని వివిధ పనుల దృష్ట్యా అద్దెకు తిప్పుతున్నాని వారిలో ఒకటి రెండు మాత్రమే అనుమతులు కలిగి ఉంటున్నాయని మిగిలినవి అనుమతులు లేనివేనని స్పష్టం చేసింది కొనుగోలు చేసినవి ఎలాంటి రుసుములు కట్టడం లేదని రిజిస్ట్రేషన్ లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలుగుతోందని అందుకే ఈ సరికొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇకపై ప్రతీ వాహనానికి లైసెన్స్ తప్పనిసరి చేస్తున్నామని, లైసెన్స్ లేని వాహనాలపై తప్పకుండా చర్యలు చేపడుతామని, ఇక ప్రవాసులు ఎన్ని వాహనాలు తీసుకోవాలని అనే విషయంపై కూడా కసరత్తులు చేస్తున్నామని ఒక వేళ తాము విధించే పరిమితిని మించి ఎవరికైనా వాహనాలు అధికంగా కావాలంటే అందుకు ప్రత్యేక రుసుము చెల్లించుకుని వాహనాలు తీసుకునేలా చట్టం రూపొందిస్తున్నామని తెలిపారు.
ఒక వేళ ఈ చట్టం కార్యరూపం దాల్చితే పరిమితి మించిన వాహనాలు ఉన్న ప్రవాసులకు బిగ్ షాక్ అంటున్నారు నిపుణులు.ఎందుకంటే ఎంతో మంది వాహానాలు కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ కోసం, ఇతరాత్రా వ్యాపారాల కోసం నడుపుతారని అలాంటి వారికి ఈ చట్టం ఇబ్బంది కలిగించే అంశమేనని అంటున్నారు నిపుణులు.