ప్రపంచ దేశాల నుంచీ ఎంతో మంది ప్రజలు కువైట్ దేశానికి వలసలు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా భారత్ నుంచీ కార్మికులుగా వలసలు వెళ్ళే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.
అయితే కరోనా పరిస్థితుల నేపధ్యమో లేక, కువైటైజేషన్ నేపధ్యమో కానీ తాజాగా కువైట్ లో ఉంటున్న ప్రవాసులకు కటిక చేదువార్త ఒకటి వినిపించింది కువైట్.అది కూడా పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునేవారికి మాత్రమేనట.
ఇప్పటికే కువైటైజేషన్ పేరు చెప్పగానే వలస వాసులు గుండెలు పట్టుకుంటున్న నేపధ్యంలో తాజాగా కువైట్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొదరు ప్రవాసులలో గుబులు పుట్టిస్తోంది.వివరాలలోకి వెళ్తే.
కువైట్ లో భారీ మొత్తంలో జీతాలు తీసుకునే వారికి బిగ్ షాక్ ఇచ్చే విధంగా కువైట్ ప్రభుత్వం అడుగులు వేస్తోందట.గడిచిన కొన్ని నెలలుగా కువైట్ ప్రవాసులకు వీసాలు, పర్మిట్లు ఇచ్చే విషయంలో కటినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
దీనిలో భాగంగానే ఇప్పుడు భారీ మొత్తంలో జీతాలు పుచ్చుకునే వారికి వర్క్ పర్మిట్లు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుందట.అలా ఎవరైతే అధిక జీతం తీసుకుంటారో వారి స్థానాలలో కువైట్ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోందట.
రానున్న రోజుల్లో కువైట్ లోని ప్రవైటు కంపెనీలలో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ప్రణాలికలు రచిస్తోందట.కువైటైజేషన్ లో భాగంగానే ఈ భారీ మార్పులు చేస్తున్నారని, ఇదే జరిగితే కువైట్ లో భారీ జీతాలు అందుకుంటున్న ప్రవాసులు అందరూ ఇక సొంత దేశాలకు వెళ్ళాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే 60 ఏళ్ళు పై బడిన వలస వాసులకు రెసిడెన్సీ పర్మిట్లు ఇచ్చే విషయంలో ఇప్పటికే పలు మార్పులు చేసి షాకుల మీద షాకులు ఇచ్చిన కువైట్ ప్రభుత్వం తాజాగా భారీ జీతం తీసుకునే వలస వాసుల విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.