కువైట్ : ఆ ఉద్యోగాలలో ప్రవాసులను తొలగించండి..అధికారులకు కీలక ఆదేశాలు..

ప్రపంచ దేశాల నుంచీ కువైట్ కు వలస కార్మికులుగా వెళ్ళే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.ముఖ్యంగా భారతీయుల సంఖ్య అధికం.

 Kuwait Eliminate Expatriates From Those Jobs Key Orders To Officials , Taxi Driv-TeluguStop.com

అక్కడ అనేక రంగాలలో కార్మికులుగా ఎంతో మంది వలస వాసులు పనిచేస్తూ ఉంటారు.అయితే కువైట్ మనవ వనరుల శాఖ ఇలా వలసలు వచ్చిన వారు ఎంత మంది ఉన్నారు, వారి జీత భత్యాలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు అనే విషయంపై తాజాగా ఓ సర్వే చేపట్టింది.

ఈ సర్వే లెక్కల ప్రకారం కువైట్ లో 5 లక్షల మంది వలస దారులు నెలకు రూ.16 వేల నుంచీ రూ.29 వేలు అలాగే3.24 లక్షల మంది ప్రవాసులు రూ.29 వేల నుంచీ రూ.43 వేలు అలాగే, 1.46 లక్షల మంది రూ.46 నుంచీ రూ.56 వేల వరకూ , 96 వేల మంది ప్రవాసులు రూ.73 వేల నుంచీ 83 వేల వరకూ వెనకేస్తున్నారట.ఇలా ప్రతీ ఒక్కరి లెక్కలు తెలుసుకున్న కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోందట.అదేంటంటే.ఏ విభాగంలో పనిచేసే ప్రవాసులైనా సరే తమకు విధించిన నిభంధనలను ఉల్లంఘిస్తే వారిని ఉద్యోగాల నుంచీ వెంటనే తలగించాలని ,దేశం నుంచీ బహిష్కరించాలని అంతర్గత మంత్రిత్వశాఖ కు ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.అలాగే పర్మిట్ గడువు ముగిసిన వారిపై ఈ చర్యలు చేపట్టలాని సూచించిందట.

ట్యాక్సీ డ్రైవర్ లు, క్లీనింగ్ సుపెర్వైజర్ లు, కార్ పార్కింగ్స్ , షాపింగ్ సెంటర్స్, గ్యాస్ స్టేషన్లు, గార్డ్స్ వంటి ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసులను తగ్గించి కువైట్ దేశ పౌరులకు ఆయా ఉద్యోగాలలో అవకాశాలు ఇవ్వాలనే కీలక ఆదేశాలు కూడా జారీ చేసిందట.కువైటైజేషన్ లో భాగంగానే అత్యధిక జీతాలు తీసుకునే ప్రవాసులను సర్వే చేసిందని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఈ పరిణామాల పట్ల ప్రవాసులు అందోళన చెందుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube