కృష్ణకు శోభన్ బాబు మరదలితో పెళ్లి చేయాలనుకున్నారా ? మరి ఏమైంది ?

ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ), అందగాడు శోభన్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు.నిజానికి వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

 Krihna And Sobhan Babu Relationshoip , Krihna, Sobhan Babu, Superstar Krishna, G-TeluguStop.com

బంగారు బాబు, ఇద్దరు దొంగలు, మహాసంగ్రామం, విచిత్ర కుటుంబం వంటి సినిమాల్లో వీరు కలిసి నటించారు.ఈ సినిమాలు తీసే సమయంలో వీరి మధ్య మంచి స్నేహం కుదిరింది.

డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో కృష్ణ ఎప్పుడూ ముందుండేవాడు.ఆ లక్షణమే శోభన్ బాబుకు తెగ నచ్చేసింది.

Telugu Box, Krihna, Krishna, Sobhan Babu, Tollywood-Telugu Top Posts

నిజానికి కృష్ణ కొద్దిరోజుల పాటు శోభన్ బాబు ఇంట్లో ఉంటూ సినిమాలు చేశాడు.ఆ సమయంలో కృష్ణ, శోభన్ బాబు ఇద్దరూ ఒకరి కష్టాలను ఒకరు షేర్ చేసుకుంటూ సమయం గడిపే వారు.కొద్దిరోజుల తర్వాత శోభన్ బాబు ఇంటికి తన మరదలు కూడా వచ్చిందట.ఆ మరదలు అంటే శోభన్ బాబుకి చాలా అభిమానం.ఆమెకు తాను బావగా కాకుండా తండ్రిలాగా చూసుకునేవాడు.అంతేకాదు ఆమెను బాగా చదివించాడు కూడా.

ఆమె పెళ్లి కూడా చేయాలనుకున్నాడు.అయితే ఎవరికి ఇచ్చి పెళ్లి చేద్దామా అని ఆలోచించేటప్పుడు అతనికి కృష్ణ గుర్తుకు వచ్చాడు.

కృష్ణ మంచి మనస్సు, కష్టపడే తత్వం, దేనికైనా తెగించే ఆటిట్యూడ్ అవన్నీ నచ్చడంతో తన మరదలును కృష్ణలు ఇచ్చి పెళ్లి చేద్దామని శోభన్ బాబు భావించాడు.

Telugu Box, Krihna, Krishna, Sobhan Babu, Tollywood-Telugu Top Posts

అయితే ఈ విషయాన్ని నేరుగా కృష్ణకు చెప్పకుండా అతడి తల్లికి వెళ్లి చెప్పాడు.కృష్ణ తల్లి ఘట్టమనేని నాగరత్నమ్మ( Ghattamaneni Nagaratnamma ) శోభన్ బాబు మరదలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంది.ఆమె ఫోటో కూడా ఇంటికి తెప్పించుకుంది.

అయితే ఫొటోలో అమ్మాయి నల్లగా కనిపించిందట.దాంతో తన అబ్బాయికి తెల్ల పిల్లని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్టు శోభన్ బాబుకు తెలిపిందట.

ఈ సమాధానం విన్నాక శోభన్ బాబు మళ్లీ ఎప్పుడూ తన మరదలు, కృష్ణ పెళ్లి గురించి ఎవరితోనూ ఎక్కడా మాట్లాడలేదట.ఒకవేళ ఈ పెళ్లి జరుగుతుంటే, ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు బంధువులు అయ్యేవారు.

కానీ కృష్ణ తల్లి వల్ల వారి రిలేషన్స్ స్నేహంతోనే ఆగిపోయింది.ఒకవేళ పెళ్లి చేసుకొని ఉంటే ఘట్టమనేని ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉండేదో, శోభన్ బాబు భార్య కూడా అదృష్టవంతురాలు అయ్యేది.

ఇక కృష్ణ ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube