ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది.పార్టీ కార్యాలయంలో జరిగిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశంలో వివాదం చెలరేగింది.
పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ మహ్మద్ నసీన్ ఖాన్ సమక్షంలోనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి.సత్తుపల్లి నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, మానవతా రాయ్ వర్గాలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.
టికెట్ మాకంటే మాకేనంటూ ఇరు వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు.ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన తోపులాట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
కుర్చీలు విసురుకుని పరస్పరం దాడులకు పాల్పడటంతో పలువురికి గాయాలు అయ్యాయి.ఈ నేపథ్యంలో వివాదానికి దిగిన కార్యకర్తలకు మహ్మద్ నసీన్ ఖాన్ సర్దిచెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేదని తెలుస్తోంది.