ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.జూన్ 1వ తేదీ వరకు అడ్మిషన్లు ప్రారంభించ వద్దని తెలిపింది.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్ కాలేజీలకు విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఏపీలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు ముగియగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి.జూన్ 1న కాలేజీలు తిరిగి ప్రారంభంకానున్నాయి.
అయితే వచ్చే ఏడాది ఇంటర్ ప్రవేశాలకు కాలేజీలు అడ్మిషన్స్ ప్రారంభిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.